అంత కంటే ఎక్కువ పాటలకు అవకాశం లేదు.

0
38

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలను ఎంత భారీగా తీస్తారో.. పాటలను కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తారు. `బాహుబలి` సినిమాలోని పాటలు విజువల్ వండర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా `ఆర్ఆర్ఆర్` రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాత్రం మూడు పాటలే ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ సోలో సాంగ్ ఒకటి, రామ్ చరణ్ సోలో సాంగ్ ఒకటి, ఇద్దరికీ కలిపి మరొకటి వుంటాయని తెలుస్తోంది. కథ ప్రకారం అంత కంటే ఎక్కువ పాటలకు అవకాశం లేదట. అలాగే సినిమా నిడివి కూడా చాలా తక్కువ వుంటుందట. రెండున్నర గంటల కంటే తక్కువగానే సినిమా వుండబోతున్నట్టు తెలుస్తోంది.