సచివాలయ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సీఎం జగన్.

0
68

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాలను సీఎం జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. ఒకే పరీక్ష ద్వారా 1,26,728 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించి తమ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. పరీక్షల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపిన ఆయన.. శిక్షణ అనంతరం ప్రజా సేవలో మమేకం కావాలని సూచించారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడానికి గ్రామ సచివాలయాలు ఉపయోగపడుతాయని తెలిపారు.