మెట్రో ట్రైన్ రాయితీ ఒప్పందంలో ఎటువంటి మార్పులేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో మెట్రో అలైన్‌మెంట్, ఛార్జీలపై కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. హైదరాబాద్ మెట్రో విజయవంతంగా నడుస్తోందని కేటీఆర్ తెలిపారు. ప్రతిరోజూ 3 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో అన్ని మెట్రోలతో హైదరాబాద్ మెట్రోను పోల్చొద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీల కంటే మెట్రో ఛార్జీలు తక్కువని చెప్పారు. పాతబస్తీకి మెట్రో సర్వీసు నడుపుతామని తేల్చిచెప్పారు. అనంతరం సుల్తాన్ బజార్ వ్యాపారులకు ఇబ్బంది రాకుండా మెట్రో నిర్మాణ పనులు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తామన్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -