అత్యంత వేగంగాఅభివృద్ధి చెందుతున్నశంషాబాద్‌ విమానాశ్రయం

0
53

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (ఆర్‌జీఐఏ) ప్రయాణికుల వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలోఈ మేరకు వెల్లడైంది. గతేడాది నాటికి సుమారు 1.5 కోట్ల మందికి పైగా ప్రయాణికులతో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో బెంగళూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి స్థానంలో నిలవగా.. టర్కీలోని అంటాలె అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో ఉంది. ఇక శంషాబాద్‌ విమానాశ్రయం మూడో స్థానం దక్కించుకుంది. అదే విధంగా మన దేశంలో రెండో స్థానంలో ఉంది. బ్యాగ్‌ ట్యాగ్‌లను తొలగించిన మొట్టమొదటి విమానాశ్రయం కూడా హైదరాబాద్‌ కావడం గమనార్హం. కేవలం హ్యాండ్‌ బ్యాగేజ్‌తో వచ్చే వారి కోసం ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెకిన్‌ ప్రవేశపెట్టారు.