శాండీకి క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ!

0
46

అమెరికాలోని హూస్టన్ వేదికగా జరిగిన ‘‘హౌడీ మోదీ’’ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సెనేటర్‌ జాన్‌ కార్నీ సతీమణి శాండీకి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. ఆమె పుట్టిన రోజు నాడే హౌడీ మోదీ కార్యక్రమం వచ్చినప్పటికీ ఆ దంపతులిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే విషయాన్ని సెనేటర్ కార్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పడంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు. 60 ఏళ్ల శాండీతో ప్రధాని నేరుగా మాట్లాడుతూ…

 ఇవాళ మీ పుట్టిన రోజు కాబట్టి నేను మీకు క్షమాపణ చెబుతున్నాను. మీ జీవిత భాగస్వామి ఇవాళ నాతో ఉన్నందుకు మీకు సహజంగానే అసూయ ఉంటుంది. మీకు అన్ని విధాలా మంచి జరగాలనీ… మీ జీవితం ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నా…

 ప్రజల మనసును గెలవడం ఎలాగో మోదీకి తెలుసంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెనేటర్ జాన్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందంలో కీలకంగా ఉన్నారు. 40 ఏళ్ల క్రితం ఆయన శాండీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.