ఆకాశాన్నిఅంటిన ఉల్లి ధర.

0
88

ఉల్లి మళ్లీ మంటెక్కిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా సాగు, దిగుబడులు డీలా పడటంతో ధరలు చుక్కల్ని తాకాయి. ఈ ప్రభావం రాష్ట్రంపై నా పడుతుండటంతో ధర ఘాటెక్కుతోంది.కొద్దిరోజుల వరకు కిలో ఉల్లి ధర రూ.20 ఉండగా అది రూ.60కి చేరింది. రాష్ట్ర మార్కెట్‌లకు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం కూడా ధర పెరుగుదలకు కారణమవుతోంది.

ఆగస్టు, సెప్టెంబర్‌లో విస్తారంగా కురిసిన వర్షాలతో వేసిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుతం ముంబాయి, పుణేలోనే ఉల్లి కిలో ధర రూ.57 నుంచి రూ.60 వరకు ఉంది. దీంతో వ్యాపారులు పాకిస్తాన్, ఈజిప్ట్, చైనా, ఆఫ్గానిస్తాన్‌ల నుంచి ఉల్లిని దిగుమతి చేసి డిమాండు తీరుస్తుంటారు.ప్రస్తుతం పాకిస్తాన్‌ నుంచి దిగుమతులపై ఆంక్షలుండటంతో అక్కడి నుంచి సరఫరా ఆగిపోయింది. దీనికి తోడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో ప్రభుత్వం స్థానికంగా ఉల్లి ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ రాష్ట్ర అవసరాలకే ప్రాధాన్యమిచ్చి పొరుగుకు సరఫరా తగ్గించింది