ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అటువంటి ఉల్లి నేడు ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఉన్న ధర నేడు ఉండటంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు రెట్టింపవుతోంది. నెల రోజుల కిందట కేవలం రూ.20 ఉన్న ఉల్లి ధర బుధవారం రూ.60కు ఎగబాకింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వ్యాపారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని తక్కువగా దిగుమతి చేసుకోవడంతో కొరత వచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతుండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ ప రిస్థితి వచ్చిందని రైతులు అంటున్నారు. వా రానికే సగానికి సగం ధర పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల వ్యవధిలో కిలో కు రూ. 15 నుంచి రూ. 20 పెరగడం తో సామాన్యులు తట్టుకోలేకపోతున్నా రు. సాధారణంగా కిలో రూ.15 నుంచి రూ. 20 వరకు ఉండేది. ప్రస్తుతం రూ. 50 నుంచి రూ. 60 పలుకుతోంది.