ప్లాస్టిక్‌ నిషేధం పై స్పందించిన సీఎం జగన్‌

0
40

కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకై… సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాఖలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్రంలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలపై సీఎం జగన్‌ సమగ్రంగా చర్చించారు. లక్ష టన్నుల వ్యర్థాలు ఫార్మా కంపెనీ నుంచి వస్తే అందులో సుమారు 30 శాతం మాత్రమే శుద్దిచేస్తున్నారు. మిగతా 70 శాతం వాతావరణంలోకి వదిలేస్తున్నారన్న సమాచారం అందింది. ఫార్మా కంపెనీల కోసం ఇప్పటికే మనం ఫార్మాసిటీలను ఏర్పాటు చేశాం. అక్కడే వాటిని పెట్టుకునేలా వారికి అనుతులు ఇవ్వాలి’’ అని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్‌ ట్యాక్స్‌ వేస్తుందని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోకపోతే మన తర్వాత తరాలు బతకడం కష్టమవుతుందని, ఈ ఆలోచనలు చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని ఆగ్రహించారు.