సెప్టెంబర్ 28న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు. ఈ రోజున పూరి, ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే.. సినిమాకు దర్శకుడే కెప్టెన్. ఓ దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడంటే ఎంతో మందికి పని దొరుకుతుంది. ఇలాంటి దర్శకత్వ శాఖలో చాలా కష్టపడి పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న 20 మంది కోడైరెక్టర్స్‌కు పూరి, చార్మిలు ఆర్థిక సాయం చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని కూడా వెలువరించారు. తాము చేసే సాయం చిన్నదేనని, అయితే కళ్లు మూసుకుని ప్రార్థించడం కంటే కొంతలో కొంతైనా సాయం చేయాలనుకుంటున్నట్లు వారు తెలిపారు. `ఇస్మార్ట్ శంకర్` సాధించిన సక్సెస్‌ను పురస్కరించుకుని పూరి, చార్మి ఈ పనిని చేస్తున్నారు. దేవుడు శక్తినిస్తే ఈ మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వారు తెలిపారు
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -