20 మంది కోడైరెక్ట‌ర్స్‌కు పూరి, చార్మిలు ఆర్థిక సాయం.

0
53

సెప్టెంబ‌ర్ 28న డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ పుట్టిన‌రోజు. ఈ రోజున పూరి, ఓ మంచి ప‌నికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే.. సినిమాకు ద‌ర్శ‌కుడే కెప్టెన్‌. ఓ ద‌ర్శ‌కుడు సినిమాను తెర‌కెక్కిస్తున్నాడంటే ఎంతో మందికి ప‌ని దొరుకుతుంది. ఇలాంటి ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి ప్ర‌స్తుతం ఖాళీగా ఉంటున్న 20 మంది కోడైరెక్ట‌ర్స్‌కు పూరి, చార్మిలు ఆర్థిక సాయం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి అధికారిక స‌మాచారాన్ని కూడా వెలువ‌రించారు. తాము చేసే సాయం చిన్న‌దేన‌ని, అయితే క‌ళ్లు మూసుకుని ప్రార్థించ‌డం కంటే కొంత‌లో కొంతైనా సాయం చేయాల‌నుకుంటున్న‌ట్లు వారు తెలిపారు. `ఇస్మార్ట్ శంక‌ర్` సాధించిన స‌క్సెస్‌ను పురస్క‌రించుకుని పూరి, చార్మి ఈ ప‌నిని చేస్తున్నారు. దేవుడు శ‌క్తినిస్తే ఈ మంచి కార్య‌క్ర‌మాన్ని భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగిస్తామ‌ని వారు తెలిపారు