తన గానమాధుర్యంతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిన రానూ మండల్ జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందించనున్నారు. బాలీవుడ్ నటుడు, గాయకుడు హిమేష్ రేష్మియాతోపాటు ‘తేరీ మేరీ కహానీ’ పాట పాడిన రానూ మండల్‌కు మరింత క్రేజ్ పెరిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫిల్మ్ మేకర్ రుషీకేష్ మండల్… రానూ బయోపిక్ రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రంలో రానూ మండల్ పాత్రను నేషనల్ అవార్డు విన్నర్, బెంగాలీ నటి సుదీప్తా చక్రవర్తి పోషించనున్నారు. ఒక ఇంటర్యూలో రుషికేష్ మండల్ మాట్లాడుతూ సుదీప్తా చక్రవర్తిని ఇందుకోసం ఇటీవల సంప్రదించామని, అయితే ఆమె ఇంకా ఏ విషయాన్ని స్పష్టం చేయలేదని అన్నారు. ఈ పాత్రకు సుదీప్తా అయితేనే సూట్ అవుతుందని, ఆమె అద్భుతమైన నటి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుదీప్తా మాట్లాడుతూ తనకు ఈ సినిమా ఆఫర్ వచ్చిందని, అయితే స్క్రిప్ట్ చదవలేదని అన్నారు. కాగా రాను మండల్ గతంలో పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్ రైల్వే స్టేషన్ వద్ద పాటలు పాడుకుంటూ జీవనం సాగించేది. లతామంగేష్కర్ పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్‌మా హై’ పాటను రాను మండల్ పాడింది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -