శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

0
96

దసరా సంధర్బంగా ఆలయాలో ఈ నెల 29 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బారికేడ్లతో పాటు ఆలయ ప్రాంగణంలో యాగశాల, యజ్ఞగుండాలు ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది.

ఈ నెల 29న బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 4.30 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, మూలవిరాట్‌కు ప్రత్యేక దీపాలంకరణ చేయనున్నారు. ఉదయం 8 గంటలకు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈ నెల 30న శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, 1న శ్రీ గాయత్రి దేవిగా, 2న శ్రీ అన్నపూర్ణదేవిగా, 3న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 4న శ్రీ మహాలక్ష్మి దేవిగా, 5న శ్రీ సరస్వతీ దేవిగా, 6న శ్రీ దుర్గాదేవిగా, 7న శ్రీ మహిషాసుర మర్థిని దేవిగా, ముగింపు రోజైన 8న శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి స్వర్ణ కవచ అలంకారం ధరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.