విశాఖలో రోడ్డు ప్రమాదం..మాజీ మంత్రి బలిరెడ్డి కన్నుమూత

0
46

రాజకీయాల్లో విలక్షణ నేతగా పేరొందిన బలిరెడ్డి సత్యారావు శుక్రవారం సాయంత్రం విశాఖ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆర్కే బీచ్‌ రోడ్డులో వాకింగ్‌కు వెళ్లిన మాజీ మంత్రి రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మాజీ మంత్రికి నివాళులు అర్పించడానికి శనివారం ఉదయం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. విశాఖ నుంచి నేరుగా పీఎస్‌పేటకు వెళ్లిన జగన్..  బాలిరెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

బలిరెడ్డి మృతితో ఆయన స్వగ్రామం పీఎస్‌పేటలో విషాదం నెలకొంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ఆయన అభిమానులు, బంధువులు, వైసీపీ శ్రేణులు చోడవరం చేరుకున్నారు. కాగా.. సత్యారావు భౌతికకాయానికి శనివారం పీఎస్‌పేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.