కార్తి హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం `ఖైదీ`. లొకేష్ కనకరాజ్ దర్శకుడు. ఎస్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, తిరుపూర్ వివేక్ నిర్మాతలు. దీపావళి సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేశారు. 900 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేస్తారు. దాంతో డ్రగ్స్‌ను సరఫరా చేసే ముఠా నాయకుడు పోలీసులందరినీ చంపైనా డ్రగ్స్ తీసుకెళ్లాలనుకుంటాడు. అదే సమయంలో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న హీరో జైలు నుండి తప్పించుకుంటాడు. అతను పోలీసులను ఎలా కాపాడాడు? అసలు పోలీసులకు, ఖైదీకి ఉన్న రిలేషన్ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చైల్డ్ సెంటిమెంట్, యాక్షన్ మూవీలా సినిమాను డైరెక్టర్ లొకేష్ కనకరాజ్ డిజైన్ చేసినట్లు అర్థమవుతుంది. చివరల్లో కార్తి `సావునైనా ఎదిరించి సావాలి సార్.. ఇలా కాళ్ల మీద పడి కాదు`అనే చెప్పే డైలాగ్ కార్తి క్యారెక్టర్‌లో ఇన్‌టెన్సిటీ అర్థమవుతుంది. తన కెరీర్‌కు తప్పకుండా ఈ సినిమా ప్రత్యేకతను తెచ్చిపెడుతుందని హీరో కార్తి చాలా నమ్మకంగా ఉన్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -