బాలుడిని బలి తీసుకున్నమ్యాగీ ప్రయత్నం..

0
106

మ్యాగీ తయారు చేయడానికి చేసిన ప్రయత్నం బాలుడిని బలి తీసుకున్న ఘటన సోమవారం తుమకూరు పట్టణంలో చోటు చేసుకుంది. క్రిస్టియన్‌ స్ట్రీట్‌లో తల్లితండ్రులతో ఉంటున్న నోయల్‌ ప్రసాద్‌ (7) సోమవారం మ్యాగీ చేస్తానంటూ తల్లిని ఒప్పించి కిచెన్‌లో గ్యాస్‌ స్టవ్‌ వెలిగించడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే గ్యాస్‌ లీక్‌ కావడంతో లైటర్‌ వెలిగిస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు అంటుకొని మంటలు వ్యా పించాయి. ఘటనలో నోయల్‌కు తీవ్రగాయాలు కావడంతో తల్లితండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినా తీవ్రగాయాలు కావడంతో చికిత్స ఫలించక నోయల్‌ మృతి చెందాడు.