వాటర్‌బోర్డు కీలక నిర్ణయం.. సిటీలో 48 గంటల పాటు నీటి సరఫరా బంద్‌.

0
44

నగరంలో రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్‌బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు. గోదావరి జలాల సరఫరాలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ప్యాకేజీ -13లో భాగంగా ఇరిగేషన్‌ శాఖ గ్రావిటీ కెనాల్‌ నిర్మిస్తోంది. గజ్వేల మండల పరిధిలోని కోడకండ్ల గ్రామం వద్ద నగరానికి వచ్చే గోదావరి 3000 ఎంఎం డయా ఎంఎస్‌ పైపులైన్‌ ఈ కెనాల్‌ నిర్మాణానికి అడ్డు తగులుతోంది. దీంతో భారీ పైపులైన్‌ ఇతర చోటికి మారుస్తున్న క్రమంలో ఇరిగేషన్‌ శాఖ విజ్ఞప్తి మేరకు వాటర్‌బోర్డు అధికారులు షట్‌డౌన్‌ తీసుకుంటున్నారు. 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.