సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. బిర్యానీకి జాతీయ స్థాయిలో పేరున్న ఈ హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన కూరగాయలు కనిపించడంతో అధికారులు ఈ జరిమానా విదించారు. గురువారం హోటల్‌కు వచ్చిన ఓ వినియోగదారులు బిర్యానీలో వెంట్రుకలు కనిపించడంతో సిబ్బందిని నిలదీశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్, వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డిలు హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీబాగులు కనిపించాయి. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు వినియోగిస్తుండటం కిచన్‌లో అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. దీంతో అధికారులు హోటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు జారీ చేసి లక్ష రూపాయల జరిమానా విధించారు. మరోమారు ఇలాగే ఉంటే హోటల్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -