నాన్ గ్రీన్ టపాసులపై నిషేధం.

0
35

దీపావళి సందర్భంగా నాన్ గ్రీన్ టపాసులు కాలిస్తే ఆ వ్యక్తి సమస్యల్లో పడటం ఖాయం. అలాగే నాన్ గ్రీన్ టపాసులు విక్రయించినవారిపై కూడా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 2018లో దీపావళికి ముందు సుప్రీంకోర్టు ఢిల్లీ-ఎన్సీఆర్‌లలో నాన్ గ్రీన్ టపాసులు విక్రయం, కాల్చడంపై నిషేధం విధించింది. దీనిని ఉల్లంఘిస్తూ టపాసులు కాల్చినా, విక్రయించినా సదరు వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

దోషిగా తేలిన వారికి ఆరు నెలల జైలు లేదా జరిమానా లేదా ఈ రెండింటినీ విధించే అవకాశముంది. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ నాన్ గ్రీన్ టపాసులపై నిషేధం విధించిన తరువాత దీనిని పట్టించుకోనివారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని తెలిపారు. కాగా గ్రీన్ టపాసుల వలన సాధారణ టపాసుల కన్నా 30 నుంచి 50 శాతం తక్కువగా కాలుష్యం వెలువడుతుంది.