బేగంపేట మెట్రోస్టేషన్‌‌లో రైళ్లురాకపోకలు నిలిపివేత.

0
27
Hyderabad may 4th 2014; Metro Rail works in progress in full swing from Nagole to Mettugudda in the city(Story pics of LVR). Pix by S.Surender Reddy.

 బేగంపేట మెట్రోస్టేషన్‌‌ మూసేశారు. భద్రతాకారణాల దృష్ట్యా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసేస్తున్నామని… రైళ్లు ఇక్కడ ఆగవని మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రతిస్టేషన్‌లోనూ ప్రయాణీకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్‌కు సమీపంలోనే బేగంపేట రైల్వేస్టేషన్ ఉండటం.. ఆందోళనకారులు అక్కడి నుంచి ముట్టడికి యత్నించే అవకాశం ఉండటంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా స్టేషన్‌ను అధికారులు మూసేశారని సమాచారం. ప్రగతిభవన్ దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.