దీపావళికి టపాసుల అమ్మకం జోరుగా సాగుతోంది.

0
33

ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు ఇవ్వడం తప్పనిసరి. వినియోగదారులు అడగడమూ అవసరం. ‘వినియోగదారుడా మేలుకో.. బిల్లు తీసుకో’, ‘సకాలంలో పన్నులు చెల్లించడం’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ చేస్తున్న ప్రచారం కేవలం ప్రకటనలే పరిమితమవుతోంది. నగర మార్కెట్‌లో దీపావళి సందర్భంగా టపాసుల వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే ఇదంతా తెల్లకాగితాలపైనే జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. టపాసులపై జీఎస్టీ 18 శాతం ఉండడంతో ఒక్క సంస్థ కూడా బిల్లు రూపేణా వ్యాపారం చేయడం లేదు. చాలా వరకు తెల్లకాగితాలపైనే బిజినెస్‌ చేస్తూ ‘జీరో దందా’ కొనసాగిస్తున్నాయి. ఇలా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి.