పుష్కరాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకు తగినట్లుగానే గతంలో కృష్ణా, గోదావరి తదితర పుష్కరాలకు పర్యాటకులు పోటెత్తారు. ఇప్పుడు తాజాగా నవంబర్ 5 వ తేదీ నుంచి బ్రహ్మపుత్ర నది పుష్కరాలు ప్రారంభ మవుతున్నాయి. ఈ సమయంలో పుష్కర స్నానాల కోసం పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రత్యేక బ్రహ్మపుత్ర పుష్కరాల టూర్ ప్యాకేజీలు ప్రకటించారు. ఇందులో రెండు ప్యాకేజీలున్నాయి. 8 రోజుల టూర్ ప్యాకేజీ (రూ.14,500 ప్లస్ జీఎస్‌టీ)లో గౌహతి, షిల్లాంగ్ ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇక 11 రోజుల ప్యాకేజీ(రూ.17500 ప్లస్ జీఎస్‌టీ)లో గౌహతి, షిల్లాంగ్, కోల్‌కత్తా ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందులో భాగంగా కామఖ్య శక్తిపీఠం, శుక్లేశ్వర మందిరం, నవగ్రహ మందిరం, పికాక్ ఐలాండ్, డాన్‌బాస్కో మ్యూజియం, దక్షిణేశ్వర్ కాళీమాత మందిరం, హౌరా బ్రిడ్జి తదితర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -