సుప్రీంకోర్టు తీర్పు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే పటాసులు కాల్చాలి.

0
53

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దీపావళి సందర్భంగా ప్రజలు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే పర్యావరణహిత పటాసులు కాల్చాలని యూపీ సర్కారు బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రజలు లైసెన్సు పొందిన అమ్మకం దారుల నుంచే పటాసులు కొనాలని కోరింది. ఈకామర్స్ వెబ్ సైట్లలో పటాసులు కొనవద్దని సర్కారు సూచించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పోలీసు అధికారులు అమలు చేస్తారని ఉత్తర్వుల్లో సర్కారు పేర్కొంది. తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే గ్రీన్ పటాసులను కాల్చాలని సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబరు 23వతేదీన ఇచ్చిన తీర్పులో పేర్కొంది. దీపావళి సందర్భంగా ఇళ్లను దీపాలతో అలంకరించి పటాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసుకుంటారు.