ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కుప్పకూలిన బౌద్ధ స్థూపం.

0
31

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖపట్నం-భీమిలి బీచ్‌ రోడ్డులో తొట్లకొండపైగల మహాస్థూపం సగ భాగం బుధవారం కూలిపోయింది. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి చెందిన ఈ స్థూపాన్ని పూర్తిగా ఇటుకలతో నిర్మించారు. స్థూపం పునర్నిర్మాణ పనులను రూ.3.4 కోట్లతో పురావస్తు శాఖ ఇటీవలే చేపట్టింది.