గన్నవరం నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే వంశీని అరెస్టు చేస్తారన్న ప్రచారం ఊపందు కోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు సీఎం పర్యటన.. మరోవైపు పార్టీ నేతలతో వంశీ భేటీ జరుగు తున్న నేపథ్యంలో గురువారం రోజు ఏం జరగబోతుందో అని రాష్ట్రం మొత్తం గన్నవరంపై దృష్టిసారించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వంశీ గురువారం ఉదయం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలతో భేటీ ఏర్పాటుచేశారు.
మరోవైపు ముఖ్య మంత్రి జగన్ సీపెట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం 11గంటలకు నియో జకవర్గంలోని సూరంపల్లికి రానున్నారు. సీఎం పర్యటన ఉన్న రోజే వంశీ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటుచేశా రు. ఈ నెల 21న వంశీ జన్మదినం. ఆ రోజు ఆయన గన్నవరంలోని పార్టీ కార్యాలయానికి వస్తారని అభిమాను లు ఎదురుచూశారు. అయితే వ్యక్తిగత కారణాలతో వంశీ ఆ రోజు కార్యాలయాని కి రాలేకపోయారు. తాజాగా సీఎం పర్యటన ఉన్న రోజే పార్టీ నాయకులతో భేటీ కానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.