`బిగిల్‌`తెలుగులో ‘విజిల్‌’ పేరుతో విడుద‌ల.

0
73

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సినిమాల‌కు త‌మిళంలో ఉన్నంత మార్కెట్ రేంజ్ తెలుగులో లేదు. అయితే ఈ మ‌ధ్య ఆయ‌న న‌టించిన త‌మిళ సినిమాలు తెలుగులోకి అనువాద‌మ‌వుతున్నాయి. ఆ క్ర‌మంలో విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `బిగిల్‌` కూడా తెలుగులో `విజిల్‌` పేరుతో విడుద‌లైంది. విజ‌య్‌ సినిమాకు మ‌రెన్న‌డూ లేనంత‌గా ఎక్కువ థియేట‌ర్స్ దొర‌క‌డం, దీపావ‌ళి పోటీలో మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో `విజిల్‌`పై అంద‌రిలో కాస్త ఆస‌క్తి పెరిగింది. మ‌రి `విజిల్‌` తెలుగులో విజ‌య్‌కు ఎలాంటి విజయాన్ని అందించింద‌నేది తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ్లాల్సిందే..

క‌థ‌:రాజ‌ప్ప‌(విజ‌య్‌) విశాఖ‌ప‌ట్నంలో ఓ రౌడీ. త‌న బ‌స్తీలోని ప్ర‌జ‌ల మంచి కోసం పాటుప‌డుతుంటాడు. రాజ‌ప్ప త‌న‌యుడు మైకేల్ అలియాస్ బిగిల్‌(విజ‌య్‌) చాలా పెద్ద ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. కొడుకు త‌న ఫుట్‌బాల్ ఆట‌తోనే బ‌స్తీలోని కుర్రాళ్లలో మార్పు తెస్తుండ‌టం గ‌మ‌నించిన రాజ‌ప్ప అత‌న్ని గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండ‌మ‌ని చెబుతాడు. త‌ను నేష‌న‌ల్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. అలాంటి క్ర‌మంలో రాజ‌ప్ప‌ని ప్ర‌త్య‌ర్థులు చంపేస్తారు. మైకేల్ త‌న బ‌స్తీ వారి కోసం క‌త్తిప‌డ‌తాడు. అత‌ని స్నేహితుడు కోచింగ్ ఇస్తున్న మ‌హిళ‌ల ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌కు నాట‌కీయ ప‌రిస్థితుల మ‌ధ్య గాయాలవుతాయి. అత‌ని స్థానంలో మైకేల్ కోచ్‌గా వెళ‌తాడు. రౌడీ అయిన మైకేల్‌ను కోచ్‌లో ఫుట్‌బాల్ టీమ్‌లో అమ్మాయిలు అంగీక‌రిస్తారా? శ‌ర్మ‌(జాకీష్రాఫ్‌) ఎవ‌రు? చివ‌ర‌కు రాజ‌ప్ప క‌ల‌ను మైకేల్ ఎలా నేర‌వేర్చాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.