ఎట్టకేలకు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సెప్టెంబర్‌లో నోటీసు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న ఆయన నెల రోజుల తర్వాత ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -