రామ్ డిఫరెంట్‌ లుక్.. ఇదిగో..

0
28

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్‌.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. పక్కా హైదరాబాదీ పోరడిగా రామ్ చేసిన రచ్చ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ‌గా రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమ ా సక్సెస్‌తో రామ్ ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా 100 రోజులు కూడా పూర్తి  చేసుకుంది. ఈ ఊపులోనే తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా సూపర్ హిట్టైన ‘తడమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.తాజాగా ఈ సినిమాను ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ‘రెడ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ లుక్ డిఫరెంట్‌గా ఉంది. లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.  హీరోగా రామ్‌కు ఇది 18వ సినిమా.

సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని దీపావళి సందర్భంగా ఆదివారం ప్రకటించారు. చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అన్నట్టుగానే ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఈ చిత్రం టైటిల్‌ను, హీరో రామ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.