రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో మరో సంచలనం.

0
24

రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కతున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా టీడీపీని టార్గెట్ చేస్తూ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాపై లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి చర్యలు మంచివికావని ఆయన అభిప్రాయపడ్డారు. సరదా కోసం, నవ్వించేందుకు ఏమైనా చేసుకోవచ్చని… కానీ ఇలా సమాజంలోని ప్రజల మధ్య చిచ్చుపెట్టడం సరైంది కాదని జేపీ వ్యాఖ్యానించారు. రామ్‌గోపాల్ వర్మ వంటి క్రియేటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తి ఈ రకమైన ధోరణితో ఉండటం మంచిది కాదని జేపీ స్పష్టం చేశారు.