వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు తీపికబురు అందించింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ రద్దును సవాల్ చేస్తూ నవయుగ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతోపాటు ఈ పిటిషన్‌పై విచారణను కూడా ముగించింది. కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకునేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్‌పిటిషన్‌కు విలువ ఉండదన్న ఏజీ వాదనతో కోర్టు ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలను ఎన్‌క్యాష్ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇన్‌జంక్షన్‌ను కూడా పక్కనపెట్టింది. దిగువ కోర్టు తీర్పును తప్పు పట్టిన హైకోర్టు.. ఇరు పార్టీల వాదనలు విని, మళ్లీ తీర్పును పునఃపరిశీలించాలని సూచించింది.