ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. రిటైర్డ్ ఉద్యోగులకు చెక్ పెట్టిన జగన్ ప్రభుత్వం.

0
38

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో గ్రామ స్ధాయి నుంచి రాష్ట్రం వరకూ అన్ని స్ధాయిలలో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సేవలకు జగన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ ఏడాది మార్చి 31 కంటే ముందు ప్రభుత్వ శాఖల్లో నియమించిన రిటైర్డ్ ఉద్యోగులందరినీ తక్షణం విధుల నుంచి తప్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై ఇవాళ మరింత క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే టీటీడీలో ఉన్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం జీవో.2323 జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ నుంచి 60మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించనున్నారు. ఆలయ ప్రత్యేక అధికారి హోదాలో కొనసాగుతున్న డాలర్ శేషాద్రికి కూడా ఇదే రూల్ వర్తించనుంది. అయితే శ్రీవారి ఆలయ సంప్రదాయాలు, వ్యవహారాలపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రత్యామ్నాయంగా ఎవరిని నియమిస్తారన్నది తెలియాల్సి ఉంది.