సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ తర్వాతే ఎవరైనా. సినిమాకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు అంతే కష్టపడుతాడు.తన సొంత నిర్మాణంలో తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కోసం తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. శుక్రవారం సినిమా విడుదల నేపథ్యంలో ఐమ్యాక్స్ థియేటర్‌లో విజయ్ సందడి చేశాడు. టికెట్ కౌంటర్‌లో కూర్చుని సినిమా టికెట్లు విక్రయించాడు. సినిమా చూద్దామని వచ్చిన ప్రేక్షకులు.. టికెట్ కౌంటర్‌లో విజయ్‌ని చూసి థ్రిల్ అయ్యారు. విజయ్ చేతుల మీదుగా టికెట్ తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కామెడీ బాగుందని..
నటుడిగానూ తరుణ్ భాస్కర్ మంచి మార్కులు కొట్టేశాడని అంటున్నారు. మొత్తం మీద విజయ్ నిర్మించిన మొదటి సినిమా నోటా నిరాశపరిచినా.. మీకు మాత్రమే చెప్తాతో హిట్ అందుకున్నట్టే అంటున్నారు.