జియో ప్లాన్లపై డిస్కౌంట్ ఆఫర్లు. జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్ ..

0
47

గత నెలలో ఐయూసీ చార్జీలను ప్రకటించిన అనంతరం భారతదేశ నంబర్ వన్ టెలికాం సంస్థ జియో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. దీంతో జియో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టింది. తన రీచార్జీలపై క్యాష్ బ్యాక్ లు అందించడం ప్రారంభించింది. తమ నెట్ వర్క్ నుంచి వేరే నెట్ వర్క్ కు కాల్ చేస్తే నిమిషానికి ఆరు పైసల చార్జీలు విధిస్తామని జియో వెల్లడించిన అనంతరం దానికి తగ్గట్లు ఉచిత నాన్ జియో నిమిషాలతో ఆల్ ఇన్ వన్ ప్లాన్లను ప్రకటించింది. రూ.222, రూ.333, రూ.444, రూ.555 ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే 1,000 నుంచి 3,000 వరకు ఉచిత నిమిషాలను జియో అందించనుంది. ఇప్పుడు తాజాగా ఇందులో ఉన్న రూ.444, రూ.555 ప్లాన్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద రూ.444 ప్లాన్ పై రూ.44, రూ.555 ప్లాన్ పై రూ.50 తగ్గింపు లభించనుంది.

రూ.444తో రీచార్జ్ చేసుకున్నట్లయితే.. మీకు రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. జియో నుంచి జియోకు అపరిమిత కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 ఉచిత నిమిషాలు అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. రూ.555 రీచార్జ్ తో రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా అందిస్తారు. జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ లో ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 3,000 ఉచిత నిమిషాలు అందించనున్నారు. అంటే మీరు వేరే నెట్ వర్క్ లకు ఎక్కువగా కాల్స్ చేస్తే ఈ ప్లాన్ మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులుగానే ఉంది.