బిగ్‌బాస్ తెలుగు 3 టైటిల్‌ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ విన్నర్‌గా రాహుల్… మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని దానితో పాటు ఓ ట్రోఫీని అందుకున్నాడు. దాదాపు 15 వారాల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ షోలో అందరితో పోటి పడి చివరకు రాహుల్ విజేతగా నిలిచారు. ఈ పోటిలో యాంకర్ శ్రీముఖి రాహుల్‌కు గట్టి పోటీ నిచ్చారు. అయితే టైటిల్ ఫేవరేట్‌గా ముందు వరుసలో రాహుల్, అలీ రెజా, బాబా బాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్‌లు ఉండగా.. అందులో రాహుల్‌నే ప్రేక్షకులు గెలిపించడానికి కారణాలు.. ఇవే అంటున్నారు ఆయన అభిమానులు. వాటిలో మొదటిది.. రాహుల్ పై శ్రీముఖి ప్రవర్తన. శ్రీముఖి ఎప్పుడూ.. టార్గెట్ చేస్తూ.. కావాలని రాహుల్‌ను రెచ్చగొట్టడం కలిసి వచ్చిందని తెలుస్తోంది. అదే సమయంతో శ్రీముఖి పై ఆడియన్స్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ మొదలైంది.
ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి రాహుల్ ప్రయాణం మొదటి నుండి అందరికంటే చాలా ప్రత్యేకమైంది. మొదటి నుండి రాహుల్.. చాలా ఫ్రాంక్‌గా ఉంటూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు. దానికి తోడు మన ఇంట్లో ఉన్న తమ్ముడు లేదా అన్న లాగా తన భాష, మాట్లాడే విధానంతో ప్రేక్షకులకు దగ్గరైయాడు. మనసులో ఏదీ ఉంచుకునేవాడు కాదు. ఇదే బిగ్ బాస్ చూసే తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. మరో వైపు రాహుల్.. తోటి కంటెస్టెంట్ పునర్నవితో కాస్త ఎక్కువ సాన్నిహిత్యంతో మెలగడం.. ఇలా ఒక సాదారణ వ్యక్తి జీవితంలో జరిగే అన్ని విషయాలు రాహుల్‌ను అందరికి ఫేవరేట్ చేశాయి. దీనికి తోడు రాహుల్, పున్నుల మధ్య జరిగిన కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ రాహుల్‌ను ఫేవరేట్‌గా చేసింది. ఇలా పలు విషయాలు ఆయనకు అధికంగా ఓట్లను పొందడానికి దోహదం చేసాయి.