సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ .. ఎద్దేవా చేసిన అంబటి రాంబాబు.

0
42

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఇస్తున్నారంటేనే… జగన్ పాలన బాగుందని అర్థమని అంబటి అన్నారు. సీఎం జగన్ పరిపాలన బాగుంది కాబట్టే మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా వారిద్దరిని మెప్పించలేమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను విమర్శించారు. ఇద్దరి మూర్ఖుల మనసు రంజింప చేయలేమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన డిఎన్ఏ లు ఒక్కటే అని మరోసారి స్పష్టం చేశారు అంబటి రాంబాబు.

టీడీపీ స్క్రిప్ట్ మీరు చదివి అభాసుపాలవుతున్నారని వ్యాఖ్యానించారు చంద్రబాబు సత్తా అయిపోయిందని.. ఆయన అజెండా మోయడానికే మీ ప్రయత్నం చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు, చంద్రబాబు హెరిటేజ్ నడుపుకోవడం ఖాయమని అంబటి విమర్వించారు. కన్నా లక్ష్మీనారాయణ ఇసుక నుంచి రాజకీయ తైలం తీయాలని చూస్తున్నారని… కానీ అందులో ఏమీ రాదని అన్నారు.