ఇవాళ అర్థరాత్రి లోపు… విధుల్లో చేరకపోతే… ఉద్యోగాలు పోయినట్లే. సీఎం కేసీఆర్.

0
36

తెలంగాణలో నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు… తిరిగి విధుల్లో చేరడానికి నేడే చివరి రోజు. ఇవాళ అర్థరాత్రి లోపు… బేషరతుగా విధుల్లో చేరకపోతే… ఇక ఉద్యోగాలు పోయినట్లే. విధుల్లో చేరని వాళ్లను తప్పించేయాలని నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటన చేశారు. ఎప్పుడో విధుల్లోంచీ తప్పించాల్సి ఉన్నా… పోనీలే అని మరో ఛాన్స్ ఇచ్చామంటున్న కేసీఆర్… ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులదే అంటున్నారు. తిరిగి విధుల్లో చేరిన వారికి అన్ని రకాల రక్షణ సదుపాయాలూ ఉంటాయనీ, అదే విధుల్లో చేరకపోతే మాత్రం ఇక ప్రభుత్వం వాళ్లను పట్టించుకోదని తేల్చి చెబుతోంది ప్రభుత్వం. విధుల్లో చేరకపోతే… తమ కుటుంబమే రోడ్డున పడుతుందంటున్న సర్కార్… అనవసరంగా యూనియన్ పెద్దలు చెప్పే మాటలు నమ్మొద్దనీ, విధుల్లో చేరిపోమనీ కోరుతోంది. ఇవాళ రాత్రిలోగా కార్మికులు చేరకపోతే, 5000 రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలనీ, అప్పుడు తెలంగాణలో ఇక పూర్తిస్థాయి ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.