డిసెంబర్ 31 లోగా మీ రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్లను లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.

0
57

మీ దగ్గర రేషన్ కార్డు ఉందా? మీ రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా? రేషన్ కార్డుతో పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సరిగ్గా చేరేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020 జూన్ 1 నుంచి దేశంలో ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ స్కీమ్ ప్రారంభం కానుంది. ఈ పథకంలో లాభాలు పొందాలంటే మీ దగ్గరున్న రేషన్ కార్డును ఆదార్ నెంబర్‌తో లింక్ చేయాలి. డిసెంబర్ 31 లోగా మీ రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్లను లింక్ చేయాలని కేంద్రం డెడ్‌లైన్ విధించింది. రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటే మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు, రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ, బ్యాంక్ పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. మీకు దగ్గర్లో ఉన్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్ లేదా రేషన్‌ షాప్‌కు వెళ్లి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. మీ రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్లు లింక్ అయిన తర్వాత మీకు సమాచారం అందుతుంది.

మీ రేషన్ కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ చేస్తే లాభమేంటో తెలుసా? మీ రేషన్ సరుకలను దేశంలో ఏ రేషన్ షాపు నుంచైనా తీసుకోవచ్చు. దీంతో రేషన్ షాప్ నిర్వాహకులు ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉండదని కేంద్రం భావిస్తోంది. 2020 జూన్ 1 నుంచి దేశంలో ‘వన్ నేషన్ వన్ కార్డ్’ అమలులోకి రానుంది. దేశంలోని 14-15 రాష్ట్రాల్లో ఒకేసారి ఈ పథకం అమలులోకి రానుంది. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డులకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే.