వీకే శశికళ 1600 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఏఎన్ఐ సంస్థ.

0
27

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ నేత వీకే శశికళకు చెందిన రూ.1600 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసింది. ఈ మేరకు ఐటీ శాఖను ఉటంకిస్తూ… వార్తా సంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో రద్దు చేసిన నోట్లను వినియోగించి సుమారు రూ.1500 కోట్ల విలువైన బినామీ ఆస్తులను కొనుగోలు చేసినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించినట్టు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఆమె శిక్షను అనుభవిస్తున్నారు. జయలలిత బతికి ఉన్నప్పుడు చిన్నమ్మగా ఆమె చక్రం తిప్పారు. భారీగా అక్రమ ఆస్తుల కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే మీద పట్టుకోసం ఆమె చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించినా.. ఆ తర్వాత పళనిస్వామి హ్యాండ్ ఇవ్వడంతో వీకే శశికళ పార్టీ పెట్టుకున్నారు.