పోలీస్ కమిషనరేట్ ఊహించని షాక్..! డ్యూటీలో అయ్యప్ప దీక్ష కుదరదన్న రాచకొండ.

0
21

అయ్యప్ప మాల వేసుకునే ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని రాచకొండ కమీషనరేట్ నిర్ణయించింది. ఒకవేళ మాల ధరించి అయ్యప్ప దీక్ష చేపట్టాలని పోలీసులు ఎవరైనా అనుకుంటే… వాళ్లు సెలవుపై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న వారు తప్పనిసరిగా యూనిఫాం ధరించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా అయ్యప్ప దీక్ష సమయంలో పోలీసు సిబ్బంది ఆచరించే నియమాల నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటారు.

అయ్యప్ప దీక్ష చేపట్టే సిబ్బంది సెలవు తీసుకోవాలని ఇందులో సిబ్బందికి సూచించారు. పోలీస్‌ సిబ్బంది గడ్డాలు, మీసాలు పెంచి విధులు నిర్వహించడం కుదరదని చెప్పారు. అవసరమైన వారు రెండు నెలలపాటు సెలవు తీసుకుని దీక్ష చేపట్టవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.