మోహన్ బాబుకు సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసిన చిరంజీవి..

0
42

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబు వాళ్ల కంటూ ఒక సెపరేట్  ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్లిద్దరు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. అందులో కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోలుగా నటిస్తే.. మరికొన్ని సినిమాల్లో  హీరోగా విలన్‌గా పోటా పోటీగా నటించారు. ఇండస్ట్రీలో వీళ్లిద్దరిది టామ్ అండ్ జెర్రీ బంధం. తాజాగా చిరంజీవి, దీపావళి సందర్భంగా మోహన్ బాబు ఇంటికెళ్లారు. చిరుతో పాటు రచయత సత్యానంద్, రాఘవేంద్రరావు పలువురు సినిమా వ్యక్తులు  కూడా మోహన్ బాబు ఇంటి విచ్చేసారు. ఈ సందర్భంగా వాళ్లింట్లో ఉన్న వెండి సింహాసనం చూసిన చిరంజీవి..వెంటనే సత్యానంద్ గారిని ఆ సింహాసనం పై కూర్చోబెట్టారు. అపుడు మోహన్ బాబు కలగచేసుకొని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఉండగా సత్యానంద్‌ను ఈ సింహాసనంపై ఎలా కూర్చబెడతావు  చిరంజీవి నిలదీసాడు. దానికి చిరంజీవి మోహన్ బాబు శైలిలో మాట్లాడుతూ.. రాఘవేంద్ర రావు ఎలాంటి శిలనైనా శిల్పంలా మలిచే అమరశిల్పి జక్కన్న లాంటివారు. ఇక ఆయనకు ఆ కథ అనే శిలను అందించే వ్యక్తినే (సత్యానంద్) అక్కడ కూర్చోబెట్టాను అని మోహన్ బాబు చిరంజీవి సమాధానం ఇచ్చాడు.