అవును ఇది నిజం..హీరోయిన్‌గా అనుష్క శెట్టికి స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో ‘అరుంధతి’ సినిమాకే అగ్రస్థానం ఉంటుంది. అరుంధతిగా అనుష్క రెండు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసింది. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క వైవిధ్య నటన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో క్షుద్ర శక్తులను వశం చేసుకున్న అఘోర పశుపతిగా సోనూసూద్ ఈ సినిమాలో అదరగొట్టారు. ఐతే ఈ సినిమాలో ‘అరుంధతి’ పాత్ర కోసం ముందుగా అనుకున్నది అనుష్క కాదట. దర్శకుడు కోడిరామకృష్ణతో పాటు నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ పాత్ర కోసం ముందుగా మంచు లక్ష్మీని అనుకున్నారు. ఆమె అమెరికాలో ఉండటంతో డేట్స్ కుదరక ఈ పాత్ర ఆమె చేయలేకపోయారు. ఆ తర్వాత అరుంధతి పాత్ర కోసం మమత మోహన్ దాస్‌ను అనుకున్నారు. కానీ క్యాన్సర్ కారణంగా ఆమె సినిమా చేయలేనని చెప్పింది. ఆ తర్వాతే ఈ పాత్ర అనుష్క దగ్గరకు వచ్చిందట. అది కూడా అంత ఈజీగా రాలేదని సమాచారం. ఆ తర్వాతనే అనుష్కను అరుంధతి పాత్ర కోసం తీసుకున్నారు. ఇక వెండితెరపై జేజెమ్మ అరుంధతిగా అనుష్క విశ్వరూపం గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రెండేళ్లకు మంచు లక్ష్మీ..‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాలో ఐరేంద్రిగా తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే కదా.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -