యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు నిజమేనా?…

0
36

ప్రముఖ టీవీ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు కొద్ది రోజులుగా షూటింగ్‌లకు హాజరు కావటం లేదు. గతంలో షూటింగ్‌లకు కొద్ది పాటి బ్రేక్‌ ఇచ్చిన ఏదో ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో సందడి చేసేవాడు ప్రదీప్‌. కానీ ఈ సారి ఏకంగా నెల రోజుల పాటు బయటకు రాలేదు. దీంతో ప్రదీప్‌ ఆరోగ్య పరిస్ధితిపై రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి.

ప్రదీప్‌కు యాక్సిడెంట్‌ అయ్యిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న వార్తలు కూడా ప్రచారమయ్యాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ప్రదీప్‌ స్పందించాడు. గురువారం తన సోషల్ మీడియా పేజ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. కొంతకాలంగా తనపై, తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన గురించి ఆలోచించి తనకు మెసేజ్‌లు, ఫోన్లు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు ప్రదీప్‌. అయితే మీడియాలో వస్తున్నట్టుగా ప్రదీప్‌ ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. కేవలం షూటింగ్‌లో జరిగిన చిన్న సంఘటనలో ప్రదీప్‌ కాలికి గాయమైంది. ఆ తరువాత కూడా షూటింగ్‌లు కొనసాగించటంతో ఆ గాయం తీవ్రమై రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టర్లు నెల రోజుల పాటు ప్రదీప్‌ను నిలుచోవద్దని సూచించారు.