అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు.

0
24

దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసిన సుదీర్ఘ కేసుకు సుప్రీంకోర్టు ముగింపు పలికింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య కేసుపై తీర్పు వెల్లడించింది. ముందుగా… అయోధ్య భూమి హక్కుపై షియా వక్ఫ్ బోర్డ్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ… ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. వివాదాస్పద భూమి తమదేనని షియా వక్ఫ్ బోర్డు తన పిటిషన్‌లో తెలిపింది. దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో… వివాదాస్పద భూమి షియా వక్ఫ్ బోర్డ్‌ది కాదని స్పష్టమవుతోంది. తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్… ప్రజల విశ్వాసాల్నీ, నమ్మకాల్నీ సుప్రీంకోర్టు గౌరవిస్తుందని తెలిపారు. బాబర్ కాలంలో మసీదు నిర్మాణం జరిగిందన్న సుప్రీంకోర్టు… ఐతే… కచ్చితంగా మసీదు ఎప్పుడు నిర్మించిందీ స్పష్టం కాలేదని తెలిపింది.

ఆర్టికల్ 120 కింద నిర్మోహీ అఖాడా వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అందువల్ల హీందూ పార్టీల్లో ఒకటైన నిర్మోహీ అఖాడా వేసిన పిటిషన్ తొలగిపోయనట్లైంది. మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదన్న సుప్రీంకోర్టు… గతంలో అక్కడో నిర్మాణం ఉండేదని తెలిపింది. ఐతే… అక్కడ రామ దేవాలయమే ఉంది అనేందుకు ఆధారాలు లేవని పురావస్తు శాఖ తెలిపిన విషయాన్ని సుప్రీంకోర్టు ఏకీభవించింది. అక్కడ ఇదివరకు ఉన్నది ఆలయమా, మసీదా అన్నదానిపై ఆధారాలు లేవని తెలిపింది.