పాపులర్ సింగర్ లత మంగేష్కర్ ఆరోగ్య పరిస్తితి విషమం.

0
77

పాపులర్ సింగర్ లత మంగేష్కర్ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కొంత కోలుకున్న మరోకసారి ఆరోగ్యం క్షీణించింది.  నిన్న సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆమెను ముంబైలోని  బ్రీచ్ క్యాండీ అసుపత్రిలో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. లత మంగేష్కర్ కొన్ని రోజుల నుండి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా ఆమె శ్వాసతీసుకోవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కోవడంతో ఆసుపత్రిలో చేర్చి.. వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు వైద్యులు. చికిత్సకు రెస్పాండ్ అవుతున్న.. ఆమె ఆరోగ్యం కొంచెం క్రిటికల్ కండీషన్‌లో ఉండడంతో ఐసీయూకు మార్చారు. అయితే లత మంగేష్కర్ అరోగ్యం గురించి తెలుసుకున్న ఆమె అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె  త్వరగా కోలుకొవాలని కోరుకుంటున్నారు.