మహారాష్ట్ర విధుల్లో పోలీసులు బీభత్సం.

0
33

మహారాష్ట్రలో పోలీసులు బీభత్సంగా కొట్టుకున్నారు. విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు ఒకరి మీద మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పరస్పరం దాడి చేసుకున్నారు. ఒకరి కంటే మరొకరు ఎక్కువ కొట్టాలన్న కసితో కొట్టుకున్నారు. చేతులతో కొట్టుకున్న తర్వాత మళ్లీ బూట్లు విప్పి మరీ కొట్టుకున్నారు. అయితే, వారిని నిలువరించేందుకు పక్కనున్న వారు ప్రయత్నించారు. వారికి నచ్చజెప్పారు. పక్కన పోలీసులు ఉన్నా కూడా కొట్టుకుంటున్న వారిని వెంటనే ఆపడానికి ప్రయత్నించలేదు. సివిల్ డ్రెస్సులో ఉన్న వ్యక్తి ఒకరిని పట్టుకుని పక్కు తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత మిగిలిన పోలీసులు వచ్చి.. మరో పోలీసును పక్కు తీసుకెళ్లారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి దగ్గరల్లోని భండారా జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోనే ఈ ఘటన జరిగింది. దాడి చేసుకున్న వారిని విష్ణు ఖేడికర్, వికాస్ గైక్వాడ్ గా గుర్తించారు.