ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ‘ఇసుక’ చుట్టే తిరుగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం ఇసుక వారోత్సవాలకు సిద్దమైతే.. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ దీక్షకు సిద్దమైంది. గురువారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ వద్ద 12గంటల నిరసన దీక్షకు దిగారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఏపీలో ఇసుక కొరతను తీర్చడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు రూ.25లక్షలు నష్ట పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో ఆయన దీక్ష చేస్తున్నారు.అలాగే ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10వేల చొప్పున భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు చేపట్టిన ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా పార్టీ నాయకులు,కార్యకర్తలు తరలిరానున్నారు. దీక్షకు జనసేన,బీజేపీ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -