జగన్… వ్యూహం లో టీడీపీ నేతలు.

0
59

గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్న జగన్… మరోవైపు ఏపీలో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీని ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ… విజయవాడ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. దీంతో ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న సీఎం జగన్… ఇందుకోసం టీడీపీ నేతగా ఉన్న దేవినేని అవినాష్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. అవినాష్ పార్టీలోకి వస్తే… విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇచ్చేందుకు వైసీపీ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి ప్రతిపక్షంలో ఉన్న దేవినేని అవినాష్‌కు వైసీపీ ముందుగానే సీటు కేటాయించడం అంటే… జగన్ ఆయనకు బంపర్ ఆఫర్ ఇవ్వడమే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.