టీడీపీకి గుడ్‌బై చెప్పిన అవినాష్.. షాక్‌ లో చంద్రబాబు

0
58

ఏపీలో రాజకీయ నేతల వలసలు జోరందుకున్నాయి. ఇటు బీజేపీ, అటు వైసీపీ..ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపడంతో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా టీడీపీకి యువనేత దేవినేని అవినాష్ రాజీనామా చేశారు. తెలుగు యువత అధ్యక్ష పదవి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్.. సీఎం జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.

ఇవాళ ఉదయం తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు అవినాష్. రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. అవినాష్‌తోపాటు పాటు కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పారు. గత ఎన్నికల్లో ఆయన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు అవినాష్. నానిపై తనను బలవంతంగా పోటీ చేయించారని అనుచరులతో పలు సందర్భాల్లో అవినాష్ చెప్పినట్లు సమాచారం.