కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఎంఎంటీస్-హంద్రీ ఇంటర్‌సిటీ ప్రమాద ఘటనలో గాయపడ్డ లోకో పైలట్ చంద్రశేఖర్ కుడి కాలును కేర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలు కావడంతో.. దాన్ని తొలగించేశారు. ఇప్పటికీ చంద్రశేఖర్ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు సమాచారం. సాయంత్రం 4గంటలకు చంద్రశేఖర్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని తెలిపారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కాగా,సోమవారం ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న హింద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 18మందికి గాయాలవగా.. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ కేబిన్‌లో ఇరుక్కున్నాడు. దీంతో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు 9 గంటల పాటు శ్రమించి అతన్ని బయటకు తీశాయి. అనంతరం కేర్ ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.