జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. ఇటీవలే ఏపీలో ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ చేసి… రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్… ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్నారన్నది ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట. బట్… అసలు విషయం వేరే ఉందన్నది రాజకీయ వర్గాల నుంచీ వస్తున్న టాక్. బ్రాడ్ మైండ్‌తో చూస్తే ఓ విషయం మనకు స్పష్టమవుతుంది. ఏంటంటే… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన దూకుడుగా ఉన్నాయి. టీడీపీ గత వైభవం కోసం పోరాడుతుంటే… జనసేన వెనక ఢిల్లీ పెద్దల వ్యూహం ఉందని తెలుస్తోంది.
ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగితే వైసీపీపై పైచేయి సాధించొచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహాంలో భాగంగానే టీడీపీ, జనసేన ఒక్కటే అనే సంకేతాలు ఇప్పటి నుంచే ప్రజల్లోకి పంపేలా… టీడీపీ నేతలు పవన్‌తో కలవడం, పవన్ చేపట్టే కార్యక్రమాలకు టీడీపీ నేతలు వెళ్లడం వంటివి జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా పవన్ పోరాటాలకు పరోక్ష మద్దతు ఇస్తోంది.