కార్తీక మాసం సందర్భంగా ఏపీ గవర్నర్‌కు బహుమతి ఇచ్చిన పవన్ కళ్యాణ్.

0
58

ఇటీవలే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను జనసేన అధినేత పవన్ కల్యాన్ భేటీ అయ్యారు. ఏపీలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, ఆత్మహత్యలపై గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే గవర్నర్ తాను చెప్పిన విషయాల్ని ఎంతో ఓర్పుగా విన్నారని చెప్పుకొచ్చారు పవన్. ఈ సందర్భంగా వారిద్దరి భేటీలో జరిగిన పలు ఆసక్తికర అంశల్ని తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేసుకున్నారు పవన్. కార్తీక మాసం సందర్భంగా గవర్నర్‌కు ఓ బహుమతి ఇచ్చామన్నారు. మారేడు చెట్టును రాజ్‌భవన్ గార్డెన్‌లో వేసేందుకు ఇచ్చానన్న అంశాన్నిపవన్ ట్వీట్ చేశారు.